జిల్లా ప్రధాన న్యాయమూర్తికి వీడ్కోలు సమావేశం
MBNR: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో న్యాయశాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో పదోన్నతి నిమిత్తం జిల్లా ప్రధాన న్యాయమూర్తికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అడ్వకేట్లు, న్యాయశాఖ ఉద్యోగులు, జిల్లా పారా లీగల్ వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.