ఘనంగా ముగిసిన హనుమాన్ చాలీసా పారాయణోత్సవం
RR: షాద్ నగర్ పట్టణంలో గత 41 రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నేటితో ముగిసింది. ఈ సందర్భంగా విజయ్ నగర్ కాలనీలోని శ్రీ సహస్ర లింగేశ్వర వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్‌కు సింధూర ధారణ, హనుమాన్ పూజ, హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం పల్లకి సేవను వైభవంగా చేపట్టారు.