రేపు గోరంట్ల శ్రీ లక్ష్మీ మాధవ స్వామి కళ్యాణోత్సవం

కర్నులు: కోడుమూరు మండలంలోని గోరంట్ల గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ మాధవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళ వారం అర్ధరాత్రి దాటిన తర్వాత బుధవారం తెల్లవారుజామున చిత్తం నక్షత్ర యుక్త కుంభ లగ్న యందు శ్రీవారి కల్యాణోత్సవాన్ని కనుల పండగ నిర్వహించేందుకు దేవదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు భారీ ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు.