'మద్యం, వ్యయ నియంత్రణ చేయాలి'
MDK: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలలో వ్యయ, మద్యం నియంత్రణ చేయాలని ఎన్నికల పరిశీలకులు భారతీయ లక్పతి నాయక్ సూచించారు. మెదక్ మండలం మంభోజిపల్లి చెక్పోస్టులను సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన తనిఖీ వ్యవస్థలను వాహనాల పరిశీలన నియంత్రణ చర్యలను పరిశీలించారు. చెక్ పోస్టుల్లో అప్రమత్తత, సమన్వయము సమాచార వినిమయం అంశాలపై పలు కీలక సూచనలు చేశారు.