ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన

CTR: పుంగునూరు BMS క్లబ్ ఆవరణంలో ఆదివారం లయన్స్ క్లబ్ వారు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వస్పందన లభించింది. కంటి సమస్యలతో వచ్చిన వారికి కుప్పం PES వైద్య కళాశాల డాక్టర్లు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో డాక్టర్ శివ, సరళ, త్రిమూర్తి రెడ్డి, రఘుపతి తదితరులు పాల్గొన్నారు.