'ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి'
KMR: బాన్సువాడ పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను మంగళవారం అకడమిక్ మానిటరింగ్ అధికారి(ఏసీఎంవో) పద్మ సందర్శించారు. ఉపాధ్యాయులు ప్రతి తరగతికి బోధన లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని దానిని సాధించే దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. భోధన తీరును పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.