సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
AKP: మండల కేంద్రమైన మునగపాకలో ఇవాళ ముగ్గురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎలమంచిలి నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకున్న వారికి రూ.78,883 తన సిఫార్సు మేరకు మంజూరైనట్లు నాగేశ్వరావు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.