ఇంజినీర్లకు సీఎం శుభాకాంక్షలు

TG: తమ మేధోశక్తితో మానవ మనుగడకు ఎన్నో ఫలాలను అందించిన ఘనత ఇంజినీర్లదేనని సీఎం రేవంత్ కొనియాడారు. 'ఇంజినీర్స్ డే పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఇంజినీర్స్ డేగా జరుపుకుంటున్నాం. మూసీ వరదల నుంచి HYDని రక్షించేందుకు ప్రత్యేక చొరవ చూపించారు. ఇంజినీర్లు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలి' అని పేర్కొన్నారు.