ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

ELR: కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ బుధవారం వరహాపట్నంలో ప్రజావేదిక నిర్వహించారు. తల్లికి వందనం రావడం లేదని ఒక విద్యార్థిని ఫిర్యాదు చేయగా, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల నుంచి పలు వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే, ప్రజల సమస్యల పరిష్కారానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.