వెంకాయపల్లిలో నిలిచిన ఎన్నికల ఫలితం
NGKL: తిమ్మాజిపేట మండలం వెంకాయపల్లి గ్రామంలో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్ మద్దతుదారు ఇందు, కాంగ్రెస్ బలపరిచిన లక్ష్మికి చెరో 236 ఓట్లు వచ్చాయి. పోలైన రెండు ఓట్ల చెల్లుబాటుపై అధికారులు సందేహం వ్యక్తం చేయడంతో, ఫలితాన్ని నిలిపివేశారు. ఈ ఎన్నికల ఫలితాలపై పూర్తి వివరాలు అధికారిక ప్రకటన తరువాతే తెలియనున్నాయి.