అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
BDK: అశ్వారావుపేటలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పగలు రెక్కీ చేసి రాత్రివేళల్లో నగదు, బంగారం దోచుకుంటున్నట్లు విచారణలో వెల్లడైంది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ముఠాకు సంబంధించిన ఇతర వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.