ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరిక: MLA
BDK: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు మహిళలు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం ఆళ్లపల్లితో పాటు వలసల గ్రామానికి చెందిన 15 కుటుంబాలు మణుగూరు క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.