VIDEO: సంతమాగులూరు చెరువులో చేపల వేట ప్రారంభం

బాపట్ల: మండల కేంద్రమైన సంతమాగులూరులో 4రోజులుగా చేపల వేట ప్రారంభమైందని మత్స్యకారులు తెలిపారు. గత ఏడాది ఏల్చూరు గ్రామానికి చెందిన ఓవ్యక్తి రూ.77లక్షలకు వేలంపాట పాడి చెరువును దక్కించుకున్నారు. అనంతరం చెరువులో చేప పిల్లలను వదిలారు. అవి పెద్దవి కావడంతో ప్రస్తుతం చేపల వేట సాగిస్తున్నారు. సంతమాగులూరు మండలంలోని పలుగ్రామాల ప్రజలు చేపల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు.