సారూ జర.. కనికరం చూపండి

సారూ జర.. కనికరం చూపండి

సిద్ధిపేట: జిల్లాలో చిన్నకోడూర్ మండల కేంద్రంలో ప్రభుత్వం పొద్దుతిరుగుడు ధ్యానం కొనుగోలు చేయడానికి మార్క్‌పెడ్ సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ఒక్క వారం కూడ తూకం వేయకుండానే కొనుగోలు నిలిపివేయడంతో ధాన్యం తెచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు. రోజుల తరబడి అధికారులు చుట్టు తిరిగిన కనికరం చూపడం లేదని రైతులు వాపోతున్నారు. అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు.