VIDEO: కొవ్వొత్తులతో నిరసన తెలిపిన కాంగ్రెస్ నేతలు

కోనసీమ: అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో సోమవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బాబి ఆధ్వర్యంలో పార్టీ నేతలు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఓట్లు చోరీ జరిగాయని బీహార్‌లో పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. ఓటు దొంగలపై న్యాయ యుద్ధం చేస్తున్నామని తెలిపారు.