10వ తరగతి పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ మృతి

10వ తరగతి పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ మృతి

KRNL: జిల్లాలో పదో తరగతి పరీక్షల వేళ మొదటి రోజు విషాద ఘటన జరిగింది. పరీక్ష కేంద్రం శ్రీ చైతన్య పాఠశాలకు చీఫ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న షేక్ అన్వర్ బాషా అకస్మాత్తుగా మృతి చెందారు. గ్యాస్ట్రిక్ సమస్యతో అస్వస్థతకు గురవగా సిబ్బంది పరీక్ష కేంద్రం సమీపంలోని అమ్మ హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్‌లో మృతి చెందినట్లు డీఈవో కార్యాలయం ధ్రువీకరించింది.