ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి

MDK: కొల్చారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వైద్యుల పనితీరు అడిగి తెలుసుకున్నారు. మందుల నిల్వలు, పలు రికార్డులను తనిఖీ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి సరైన వైద్యం అందించాలని సూచించారు.