నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
NGKL: తాడూరు మండలం మేడిపూర్ సబ్ స్టేషన్‌లో విద్యుత్ మరమ్మతుల కారణంగా మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ ఏఈ శ్రీరాములు తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని మేడిపూర్, పోల్మూరు, గుట్టలపల్లి, ఆకునెల్లికుదురు, నాగుదేవుపల్లి గ్రామాలకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ ఉండదని సూచించారు.