'బాల్య వివాహాలు నేరం'

'బాల్య వివాహాలు నేరం'

NLR: అల్లూరు మండలం పురిణి నల్లచెరువు కట్ట అంగన్వాడీ కేంద్రంలో కిశోరి వికాసంపై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. బాల్య వివాహాలు చేయడం నేరమని స్థానికులకు వివరించారు. బాల్య వివాహాలతో ఎంతోమంది ఆడపిల్లలు విద్యకు దూరమవుతున్నారని చెప్పారు. 18 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ అనూష, సిబ్బంది పాల్గొన్నారు.