జిల్లా కోర్టులో చలివేంద్రం ప్రారంభం
MBNR: కోర్టుకు వచ్చే ప్రజల దాహార్థిని తీర్చేందుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఎండల తీవ్రత దృష్ట్యా వడదెబ్బ నుంచి ప్రజలను కాపాడేందుకు దీనిని ఏర్పాటు చేసినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.