రంగనాయక స్వామి ఆలయానికి ప్రత్యేక బస్సులు

రంగనాయక స్వామి ఆలయానికి ప్రత్యేక బస్సులు

ప్రకాశం: రాచర్ల మండలంలోని నెమలిగుండం రంగనాయక స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా నేటి నుంచి 5వ తేదీ వరకు రెండు రోజుల పాటు, పొదిలి నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ శంకర్ తెలిపారు. అలాగే తూర్పు గంగవరం వద్ద ఉన్న గుంటి గంగమ్మ తిరుణాలకు ఇవాళ ప్రత్యేకంగా 15 బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. కావున భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.