జిల్లా కార్యాలయంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
BHPL: జిల్లా BJP కార్యాలయంలో ఇవాళ జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి ఆధ్వర్యంలో BJP 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిషదర్ రెడ్డి BJP జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్‌తో దేశం అభివృద్ధి దిశగా సాగుతోందని, రానున్న రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు.