జోరుగా బొర్రా లో ఉపాధి హామీ పనులు ప్రారంభం.

విశాఖ : అల్లూరి జిల్లా అనంతగిరి మండల కేంద్రంలో గల బొర్రా పంచాయతీ లో ఉపాధి హామీ పథకం నూతన చెరువు పనులను మంగళవారం కొబ్బరి కాయలు కొట్టి కూలీలు పనులను ప్రారంభించారు. అనంతరం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గోపీ మాట్లాడుతూ..ఎండ తీవ్రతను కారణంగా పనులను సకాలంలో పూర్తి చెయ్యాలని, కొలతల ప్రకారం రోజువారి కూలీ 300 రూపాయలు పొందే విధంగా పనులు చేపట్టాలని పేర్కొన్నారు.