IND vs SA: మూడో రోజు ఆట ప్రారంభం
సౌతాఫ్రికాతో గౌహతి టెస్ట్ మూడో రోజు ఆట ప్రారంభమైంది. 9/0 స్కోర్ వద్ద రెండో రోజు ఆట ముగించిన టీమిండియా ఇంకా 480 రన్స్ వెనకబడి ఉంది. క్రీజులో రాహుల్(2), జైస్వాల్(7) ఉన్నారు. అంతకుముందు ప్రొటీస్ జట్టు 489 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే తొలి మ్యాచ్ ఓడిన భారత్‌కి ఇది డూ ఆర్ డై టెస్ట్. ఇందులో ఓడినా, డ్రా చేసుకున్నా సిరీస్ చేజారుతుంది.