గచ్చిబౌలి శ్రీరామ్ నగర్‌లో DCM బ్రేక్ డౌన్
HYD: గచ్చిబౌలి ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. శ్రీరామ్ నగర్ వద్ద వాహనం బ్రేక్‌డౌన్ కావడంతో మజీద్ బండ నుంచి బోటానికల్ గార్డెన్ సిగ్నల్ వైపు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. ప్రయాణికులు వీలైనంతవరకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని, లేన్ క్రమశిక్షణ పాటించాలని, ట్రాఫిక్ సిబ్బంది సూచనలు అనుసరించాలని అధికారులు సూచిస్తున్నారు.