ఉడిత్యాలలో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం

ఉడిత్యాలలో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం

MBNR: బాలానగర్ మండలం ఉడిత్యాల పంచాయతీ పరిధిలోని మామిడి గుట్ట తండాలో బుధవారం మూడు ఇందిరమ్మ ఇళ్లను సర్పంచ్ చక్కెర సువర్ణ ప్రారంభించారు. ప్రభుత్వం పేదలకు గృహ వసతి కల్పించడం సంతోషకరమని, లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. వార్డు సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.