నేడు పుల్లలచెరువు మండలంలో పవర్ కట్

నేడు పుల్లలచెరువు మండలంలో పవర్ కట్

ప్రకాశం: పుల్లలచెరువు మండలంలో ఆదివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ ఏఈ కిషోర్ తెలిపారు. మండలంలోని ఎండ్రపల్లి, ఆర్.ఉమ్మడివరం, పుల్లలచెరువు సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ లైన్ల మెయింటెనెన్స్ కారణంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు .