VIDEO: రూ.5 బిస్కెట్.. 130KM నడిచిన కుక్క
ADB: జిల్లాలోని గుడిహత్నూరులో వింత ఘటన చోటుచేసుకుంది. హనుమాన్ దీక్షాపరుల మార్గమధ్యంలో ఒక శునకానికి కేవలం రూ.5 బిస్కెట్ ప్యాకెట్ వేసినందుకు 130 కిలోమీటర్లు వారితోపాటు ఐదు రోజుల పాటు గుడిహత్నూరు నుంచి కొండగట్టు వరకు నడిచింది. నడక వల్ల ఆ కుక్క కాళ్లకు నొప్పులు రావడంతో భక్తులు దానికి సాక్సులు తొడిగి, ఎంతో ప్రేమగా సపర్యలు చేశారు. ఈ ఘటన ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.