VIDEO: బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు
W.G: తాడేపల్లిగూడెంలో ఇవాళ పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు, రైతులు బంకుల వద్ద బారులు తీరారు. 3వ రోజు ఇంధనం దొరక్కపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తుండగా, మరికొన్ని చోట్ల క్యూలైన్లలో నిరీక్షిస్తున్నారు. వరి కోతల సమయంలో డీజిల్ కొరత ఏర్పడితే ధాన్యం తరలించడంలో ఇబ్బందులు ఎదురవుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.