తీర్థ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
VZM: కొత్తవలస మండల చింతలపాలెంలో గురువారం జరిగిన చిట్టిపాప తీర్థ మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పాల్గొన్నారు. ప్రతి ఏడాది భీష్మ ఏకాదశి రోజున చిట్టిపాప మందిరం వద్ద తీర్థం కొనసాగుతుందని గ్రామ సర్పంచ్ మాకేనా సీతారామ పాత్రుడు (నవీన్) తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కోళ్ల రాం ప్రసాద్ పాల్గొన్నారు.