పలు రైళ్లను ప్రారంభించనున్న మోదీ
ఇవాళ, రేపు అసోం, పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ క్రమంలో అసోంలో రూ.47,600 కోట్లకు పైగా అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. అలాగే కామాఖ్య-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, గువాహటి-న్యూజల్పాయిగుడి ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు. వాటితో పాటు నారంగి-అగర్తల ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలెక్కించనున్నారు.