'నిరంతర పర్యవేక్షణ ఉండాలి'

MNCL: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్లను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు పోతు విజయశంకర్ కోరారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్లో ఎక్కువగా నిరుపేద విద్యార్థులే చదువుకుంటారని, వారికి నాణ్యమైన భోజనం పెట్టాలన్నారు. హాస్టల్లో ఉండే విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని ఆమె కోరారు.