RAIN ALERT: నేడు, రేపు వర్షాలు
AP: బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దాదాపు అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ అకాల వర్షాలతో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.