గుంతతో తప్పని తిప్పలు

TPT: తిరుపతిలోని సప్తగిరి నగర్‌లో పైప్ లైన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఆటో స్టాండ్ మెయిన్ రోడ్డు వద్ద తవ్వకాలు చేపట్టారు. ఆ తర్వాత ఎవరూ దీనిని పట్టించుకోవడం లేదు. స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారులకు సైతం అవస్థలు తప్పడం లేదు. కార్పొరేషన్ అధికారులు స్పందించి గుంతలు పూడ్చాలని కోరుతున్నారు.