జోరుగా కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లు
TG: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి. 90 లక్షల మెట్రిక్ టన్నులు సివిల్ సప్లై ద్వారా కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 8,433 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు రూ.13,661 కోట్ల విలువైన 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఇప్పటివరకు సన్న వడ్లకు రూ.314 కోట్ల బోనస్ ప్రభుత్వం చెల్లించింది.