జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

KMR: బిక్కనూర్ మండల కేంద్రంలో ఓ దినపత్రిక విలేకరిగా పనిచేస్తున్న సత్యం అనే వ్యక్తి ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకొని,TUWJ(IJU) యూనియన్ జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ మంగళవారం బాధిత కుటుంబ సభ్యులకు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తామన్నారు.