ఆర్థిక హామీల అమలు కోసం FAPTO నిరసన

ఆర్థిక హామీల అమలు కోసం FAPTO నిరసన

కడపలో FAPTO ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆర్థిక హామీల అమలు కోసం సోమవారం నిరసన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన వారు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఖండించారు. పీఆర్‌సీ, బకాయిల చెల్లింపులపై స్పందన లేదని విమర్శించారు. 9న నిరసన, 25-27 తేదీల్లో విజయవాడలో దీక్షలో పాల్గొంటామని తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.