నేటి నుంచి అగస్త్యేశ్వరుని కళ్యాణ వేడుకలు
GNTR: వంగిపురం గంగాపార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ వేడుకలు సోమవారం ప్రారంభమై 16 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో అశోక్ కుమార్ తెలిపారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో 10న విఘ్నేశ్వర స్వామి పూజ, 11, 12 తేదీల్లో ప్రత్యేక అలంకరణ వాహన సేవలు, 13న కల్యాణం, 14న దివ్య రథోత్సవం, 15న వసంతోత్సవం, 16న పవళింపు సేవ ఉంటాయని ఆలయ ఈవో వెల్లడించారు.