విదేశీ సినిమాలు చూసినవారికి కిమ్ మరణ శిక్ష!

విదేశీ సినిమాలు, టీవీ షోలు చూసినందుకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ బహిరంగంగా మరణ శిక్షలు అమలు చేస్తున్నారని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. ప్రజల్లో భయాన్ని పెంచడానికి ఈ శిక్షలను కాల్పుల బృందాల ద్వారా అమలు చేస్తారని, దేశం నుంచి పారిపోయి వచ్చిన వారు తెలిపారు. ఇలాంటి నేరాలకు మరణ శిక్ష విధించేందుకు 2015 నుంచి కొత్త చట్టాలు తీసుకొచ్చారని నివేదికలో పేర్కొన్నారు.