ప్రభుత్వ స్థలాలు పరిశీలన

ELR: నూజివీడు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణం, హనుమాన్ జంక్షన్ రోడ్డులోని మార్కెట్ యార్డ్ సమీపంలో గల జిల్లా పరిషత్తు స్థలాలను నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న బుధవారం పరిశీలించారు. డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయం నిర్మాణం కోసం ఉన్నతాధికారుల ఆదేశానుసారం స్థలాలను పరిశీలించడం జరిగిందన్నారు. పరిశీలన అనంతరం సబ్ కలెక్టర్ నివేదిక అందిస్తామన్నారు.