'డ్వాక్రా మహిళలకు చంద్రబాబు టోకరా'
VSP: డ్వాక్రా మహిళలను లక్షాధికారులను చేస్తానన్న చంద్రబాబు నాయుడు హామీలు ఆచరణలో విఫలమయ్యాయని వైసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. విశాఖలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. నాబార్డు నివేదిక ప్రకారం డ్వాక్రా సంఘాలకు బ్యాంకు రుణాల్లో రూ.16,600 కోట్ల కోత పెట్టారని, సున్నావడ్డీ పథకాన్ని నిర్వీర్యం చేశారని తెలిపారు.