'మహిళా సాధికారతకు సీఎం పెద్దపీట వేస్తున్నారు'

'మహిళా సాధికారతకు సీఎం పెద్దపీట వేస్తున్నారు'

AP: మహిళా సాధికారతకు సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలకు గౌరవం ఇచ్చే సమాజమే నిజమైన అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. మహిళలు దృఢంగా ఉంటేనే కుటుంబం, సమాజం బలంగా ఉంటుందని చెప్పారు. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన మహిళలను సత్కరించిన ఆయన, స్వయం సహాయక సంఘాల ఆర్థిక అభివృద్ధి కోసం రూ.1370 కోట్ల రుణాల చెక్కులు పంపిణీ చేశారు.