'దళిత యువకుడిపై దాడి చేసిన దోషులను శిక్షించాలి'

కోనసీమ: అయినవిల్లి మండలంలో దళిత యువకుడు ధోనిపాటి మహేష్‌పై దాడి చేసిన దోషులపై రౌడీషీట్ తెరవాలని దళిత చైతన్య వేదిక నాయకులు శనివారం డిమాండ్ చేశారు. రాజోలు మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం దళిత నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహేష్‌పై దాడికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని తహసీల్దార్‌కి వినతిపత్రం అందజేశారు.