'వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి'

'వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి'

MDK: వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని పెద్ద శంకరంపేట ఎస్సై ప్రవీణ్ రెడ్డి తెలిపారు. మండలంలోని మల్కాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై ప్రజలకు అవగహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు.