నైపుణ్య కేంద్రంగా SRR ప్రభుత్వ అటానమస్ కళాశాల
KNR: కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు అకాడమిక్ ఆడిట్ తనిఖీల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని SRR ప్రభుత్వ అటానమస్ కళాశాలను అకాడమిక్ ఆడిట్ సలహాదారులు, ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ ప్రొ. డీ. వరలక్ష్మి, డా. వాసాల వరప్రసాద్ సంయుక్తంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కళాశాలలో వసతులు, వనరులు నైపుణ్య వికాస శోధన కేంద్రంగా నిలుస్తుంది అన్నారు.