అడ్మినిస్ట్రేషన్ అంటే ఇదేనా?.. BRS వీడియో
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ ‘ఫేక్ ప్రామిసులు ఇచ్చిన కాంగ్రెస్‌కి బుద్ధి చెబుదాం’ అంటూ BRS ఓ వీడియోను పోస్ట్ చేసింది. తల్లీకూతుర్ల మధ్య సంభాషణతో సాగిన ఈ వీడియోలో.. KCR 24 గంటల కరెంట్ ఇస్తే, ఇప్పుడు పవర్ కూడా సరిగా ఇవ్వట్లేదని దుయ్యబట్టింది. 6 గ్యారంటీలతో అసలుకే ఎసరు పెట్టారని, ప్రాక్టికల్ లీడర్‌షిప్ కోసం BRS భరోసానే మళ్లీ రావాలని పేర్కొంది.