కావలి నూతన ఆర్డీఓ బాధ్యతలు స్వీకరణ

కావలి నూతన ఆర్డీఓ బాధ్యతలు స్వీకరణ

NLR: కావలి నూతన ఆర్డీఓగా వంశీకృష్ణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన బదిలీ పై సత్యసాయి జిల్లా నుండి వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ కావలి రెవెన్యూ డివిజన్ పరిధిలోని మండలాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో పని చేసే ఉద్యోగులు ఆర్డీఓను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.