కానిస్టేబుల్‌ను అభినందించిన జిల్లా ఎస్పీ

కానిస్టేబుల్‌ను అభినందించిన జిల్లా ఎస్పీ

NLG: ఓ సంస్థ నుంచి అవార్డు అందుకున్న కానిస్టేబుల్‌ విష్ణువర్ధన్ గిరి విక్రమ్‌ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గురువారం అభినందించారు. ఇటీవల అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పట్టు కోవడంలో సమర్థవంతంగా విధులు నిర్వహించిన కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరి విక్రమ్ సేవలను గుర్తించిన ఓ ప్రైవేట్ సంస్థ తెలంగాణ రియల్ హీరోస్ అవార్డును హైదరాబాద్‌లో సీఎం చేతుల మీదుగా అందజేసింది.