మాజీ డిప్యూటీ స్పీకర్‌ను కలిసిన నాయకులు
VZM: మాజీ డిప్యూటీ స్పీకర్, వైసీపీ సీఈసీ సభ్యుడు కోలగట్ల వీరభద్ర స్వామిని వైసీపీ పట్టణ యువజన, విద్యార్థి విభాగాల నూతన నాయకులు గురువారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఇటీవల నియమితులైన నాయకులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారికి మాజీ డిప్యూటీ స్పీకర్ సూచించారు.