కలెక్టరేట్‌లో ఘనంగా శ్రీ సత్య సాయి శతజయంతి వేడుకలు

కలెక్టరేట్‌లో ఘనంగా శ్రీ సత్య సాయి శతజయంతి వేడుకలు

నెల్లూరు కలెక్టరేట్‌లో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర పండుగగా సత్య సాయి జయంతి నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తిక్కన ప్రాంగణంలో ఈ వేడుకలను జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్‌వో విజయ్ కుమార్ ప్రారంభించారు.